ప్రచురణ తేదీ : Sep 29, 2017 12:50 PM IST

సినిమా సందడిలో ..దసరా విన్నర్ డిసైడ్ అయిపొయింది!


తెలుగు సినిమా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి ఈ సారి దసరా బరిలో ఇద్దరు స్టార్ హీరోలతో పాటు కుర్ర హీరో కూడా రంగంలోకి వచ్చాడు. ఈ నెల 21న జై లవకుశ సినిమాతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. 27న స్పైడర్ సినిమాతో మహేశ్ తన స్టామినా పరీక్షించుకున్నాడు. వీళ్ళకి పోటీగా కుర్ర హీరో శర్వానంద్ దసరా బరిలోకి వచ్చి తనని తాను టెస్ట్ చేసుకున్నాడు. అయితే ఈ మూడు సినిమాల్లో దసరా రేస్ లో ఆ మహేశ్, ఎన్టీఆర్ ని క్రాస్ చేసుకొని శర్వానంద్ నిలవడం విశేషం.

ఇక సినిమాల పరంగా చూసుకుంటే మూడు డిఫరెంట్ జోనర్స్ లో వచ్చిన మూడు సినిమాల్లో జై లవకుశ సినిమా ఎన్టీఆర్ యాక్టింగ్ ఆకట్టుకొని ఫ్యాన్స్ వరకు ఆకట్టుకున్న, రెగ్యులర్ ప్రేక్షకుడు నుంచి ఎవరేజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో తర్వాత వచ్చిన స్పైడర్ సినిమా సైకో థ్రిల్లర్ గా వచ్చి, కథ, కథనంతో ఆకట్టుకున్న, తెలుగు ప్రేక్షకుడు కోరుకునే ఎలిమెంట్స్ లేకపోవడంతో ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది, ఈ సినిమా క్లాస్ ఆడియన్స్ ని కనెక్ట్ అయిన, బీ,సి సెంటర్స్ లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే వీటితో పోటీగా వచ్చిన మహానుభావుడు సినిమా మాత్రం క్లీన్ ఎంటర్టైన్ తో అన్ని వర్గాలకి ఆకట్టుకునే విధంగా వినోదాత్మకంగాగా ఉండి అందరిని ఆకట్టుకుంది. దీంతో ఈ దసరా బరిలో పెద్ద సినిమాలని క్రాస్ చేసుకొని మహానుభావుడు విజేతగా నిలవడం విశేషం.

ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ రెండు చిత్రాలని, డిస్టిబ్యూటర్స్ కోట్లు పెట్టి రైట్స్ సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమాల మీద పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో, రాదో తెలియని పరిస్థితిలో డిస్టిబ్యూటర్స్ ఉన్నారు. ఎ విధంగా చూసుకున్న భారీగా నష్టాలు తప్పవేమో అనిపిస్తుంది. ఇక మహానుభావుడు సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన నిర్మాతకి భారీగా లాభాలు తీసుకురావడంతో పాటు, సినిమా రైట్స్ సొంత చేసుకున్న డిస్టిబ్యూటర్స్ కి కూడా భారీ లాభాలు తెచ్చిపెట్టేలా ఉందనేది బయట వినిపిస్తున్న టాక్. మొత్తానికి కామన్ ఆడియన్స్ ని వినిపిస్తున్న మాట ప్రకారం ఆ రెండు సినిమాలతో పోల్చి చూస్తే మహానుభావుడు ఈ పండగలో చూడదగ్గ చిత్రం అని అనుకుంటున్నారు.

Comments