ప్రచురణ తేదీ : Nov 14, 2017 2:08 AM IST

జగన్ పై సెటైర్లు.. వైసీపీలో చేరాలంటే అవి ఉంటే చాలన్న లోకేష్ !

ఏపీ పంచాయతీ రాజ్ శాఖామంత్రి నారా లోకేష్ నేడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ ప్రతిపక్ష నేత జగన్ పై సెటైర్లు విసిరారు. వైఎస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్ లో జగన్ ప్రోత్సాహం వలన నెం 1 గా ఉండేదని అన్నారు. వైసిపిలో చేరాలంటే సీబీఐ కేసులు ఉండాలని, అదే వారికి అర్హత అని ఎద్దేవా చేశారు.

ఎల్లప్పుడూ జగన్ కి ముఖ్యమంత్రిని విమర్శించడమే పని అన్నారు. తమ పేర్లేమైనా పారడైజ్ పేపర్స్ లో బయట పడ్డాయా అంటూ ప్రశ్నించారు. మరో టిడిపి నేత సి ఎం రమేష్ మాట్లాడుతూ జగన్ ని ఆయన దావూద్ ఇబ్రహీంతో పోల్చారు. జగన్ పాదయాత్రకు స్పందన కరువైందని అన్నారు. లోకేష్ మంత్రిగా భాద్యతలు చేపట్టాకా తొలిసారి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

Comments