ప్రచురణ తేదీ : Dec 3, 2017 12:49 PM IST

కనుమరుగైన హీరోయిన్ ని మళ్లీ పట్టుకొస్తున్న పవన్, త్రివిక్రమ్..!

పవన్, త్రివిక్రమ్ అనగానే అజ్ఞాతవాసి కోసం అనుకోవద్దు. ఇది పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న నితిన్ సినిమా గురించిన వార్త. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన చిత్రాలకు ఈ మధ్య ఎక్కువగా పాత హీరోయిన్ల కోసం జల్లెడ పడుతున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న నితిన్ చిత్రానికి కూడా అదే చేయబోతున్నాడు. 90 లలో చిత్రాలపై పట్టున్న వారికి హీరోయిన్ లిజీ గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ఆమె పలు తెలుగు చిత్రాల్లో నటించారు. వాటిలో చెప్పుకోదగ్గది రాజశేఖర్ ‘మగాడు’. వెండి తెరకు దూరమైన లిజీ దాదాపు 25 ఏళ్ల తరువాత మళ్లీ కెమెరాముందుకు వచ్చానని స్వయంగా ప్రకటించారు.

నితిన్ చిత్రంలో తాను ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. మలయాళం, తమిళ చిత్రాల్లో లిజీ ఎక్కువగా నటించారు. తెలుగులో ఆమె 8 చిత్రాల్లో నటించడం విశేషం. తన 22 ఎల్లా వయస్సులోనే సినిమాలు చేయడం మానేశానని లిజీ అన్నారు. అది సరిదిద్దుకోలేని తప్పు. సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా మంచి పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తా అంటూ తన పేస్ బుక్ పోస్ట్ లో వివరించారు. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కు లిజీ మాజీ భార్య.

Comments