ప్రచురణ తేదీ : Oct 30, 2017 9:34 PM IST

ఫోటో టాక్ : వీళ్ల రొమాన్స్ కి లేదిక ఏ అడ్డంకి..!

లిసా హేడెన్ పేరు తెలుగువారికి పెద్దగా పరిచయం లేదు. బాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడు ఫెమస్సే. ఆ మధ్యన రామ్ చరణ్ రచ్చ చిత్రంలో ఇలా మెరిసి అలా వెళ్ళిపోయింది. మోడలింగ్ లో ఓ వెలుగు వెలిగిన లిసా హేడెన్ 2010 ఆయేషా చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అడపా దడపా సినిమాలు చేసుకుంటూ కాలం గడిపిన ఈ హాట్ సుందరి గతేడాది లండన్ లోని ఎన్నారై బిజినెస్ మాన్ ని పెళ్లాడింది.

ఈ ఏడాది ఓ బాబుకి కూడా జన్మనిచ్చింది. తాజగా భర్త మరియు కొడుకు తో ఓ ఐలాండ్ కు లిసా విహారయాత్రకు వెళ్ళింది. ఫస్ట్ వెడ్డింగ్ యానవర్సరీ సందర్భంగా ఆమె ఈ విహారయాత్రకు వెళ్లడం విశేషం. అక్కడ బికినీ ధరించి భర్తతో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వయసు పెరిగినా లిసా అందం మాత్రం తగ్గలేదనే కామెంట్స్ నెటిజన్లు పెడుతున్నారు.

Thanks for sharing all the best things in life with me. So proud of the dad and husb you are. #oneyear💪

A post shared by Lisa Haydon (@lisahaydon) on

Comments