ప్రచురణ తేదీ : Sun, Jan 8th, 2017

ల్యాప్ టాప్ ప్రాణాలు కాపాడింది.. ఎలాగో తెలుసా..?

laptop
స్టీవ్ ప్రాప్పియర్ అనేవ్యక్తి అమెరికాలోని లాడర్దాలే ఎయిర్ పోర్ట్ లో బ్యాగేజి కౌంటర్ వద్ద ఉన్నాడు. అంతలోనే ఓ దుండగుడు తన హ్యాండ్ గన్ తో కాల్పులకు తెగబడ్డాడు. అందులోని ఓ బులెట్ స్టీవ్ కు వెనుక భాగం లో తగిలింది.తన వెనుక ఉన్న బ్యాక్ పాక్ కు ఎదో తగిలినట్లు అనిపించడంతో అతడు అలాగే పడిపోయాడు.

కాల్పులు సద్దుమణిగాక బాత్ రూమ్ కు వెళ్లి చూసుకున్నాడు. బ్యాగ్ కు రంద్రం ఉంది. దీనితో బాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో ఉన్న లాప్ టాప్ కు బులెట్ దిగి ఉంది. లాప్ టాప్ లేకపోయి ఉంటె తన ప్రాణాలు పోయోవాని స్టీవ్ అన్నాడు.తన లాప్ టాప్ ని ఎఫ్ బీఐ కి ఇన్వెటిగేషన్ కొరకు అందించాడు. కాల్పులు జరిపిన వ్యక్తి ఇస్తెబెన్(26) గా గుర్తించారు. కాల్పుల్లో ఐదుగురు చనిపోగా, 8 మంది గాయపడ్డారు.

Comments