ప్రచురణ తేదీ : Jan 30, 2017 12:14 PM IST

బాబోయ్ .. లారెన్స్ ఈ భామను వదిలేలా లేడుగా !!

lawrence-and-rai-lakshmi
కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్ .. ఆ తరువాత నటుడు.. దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికే లారెన్స్ కమర్షియల్ దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నాడు. ఆ మధ్య ‘కాంచన’ సినిమాలో హీరోయిన్ గా లక్ష్మి రాయ్ తో చిందేసినప్పడినుండి మనోడు ఆమెను వదిలేలా కనిపించడం లేదు .. ఎందుకంటే ఇటీవలే మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 వ సినిమాలో లారెన్స్ డాన్స్ మాస్టర్ గా కంపోజ్ చేసాడు.. ఐతే ఆ సాంగ్ లో వేరే హీరోయిన్స్ నటిస్తారని చాలా వార్తలు వచ్చాయి కానీ .. వాళ్ళందరిని కాదని లక్ష్మి రాయ్ ని దింపాడు. ఇది చాలదన్నట్టు .. లేటెస్ట్ గా లారెన్స్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా ”మెట్ట శివ కెట్ట శివ” సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో లక్ష్మి రాయ్ చేసింది. నిజానికి ఈ సాంగ్ లో ముమైత్ ఖాన్ చేయాల్సి ఉంది, కానీ లారెన్స్ ఆ ఛాన్సును లక్ష్మి రాయ్ కి అందచేసాడు. వీరిద్దరి మధ్య ఎదో వ్యవహారం సాగుతుందనే టాక్ కూడా కోలీవుడ్ లో వినిపిస్తుంది. ఇక ఈ మధ్య లక్ష్మి రాయ్ ఐటెం సాంగ్స్ తో మంచి హాట్ క్రేజ్ తెచ్చుకుంది. అలాగే ఈ హీరోయిన్ గా జూలీ 2 సినిమాలో నటిస్తుంది.

Comments