ప్రచురణ తేదీ : Jan 8, 2018 3:34 PM IST

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై లక్ష్మీ పార్వతి అలక..?

బాలయ్య ఎన్టీఆర్ బయో పిక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రకటన చేసినప్పటి నుంచే వివాదం మొదలైంది. ఎన్టీఆర్ జీవిత చరిత్రని నిస్వార్థంగా చూపించాలని లేకుంటే పోరాటం చేస్తానని లక్ష్మి పార్వతి హెచ్చరించారు. మొదట్లో ఈ చిత్రానికి రాంగోపాల్ వర్మని దర్శకుడుగా అనుకున్నారు. తెరవెనుక ఏం జరిగిందో ఏమో కానీ ఆ తరువాత తేజ సీన్ లోకి వచ్చాడు. బాలయ్య టీం పై కక్ష కట్టిన ఆర్జీవీ వారికంటే ముందుగా ఎన్టీఆర్ జీవిత చరిత్రని లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కిస్తాని ప్రకటించేశాడు. ఫస్ట్ లుక్ కూడా విడుదలైపోయింది.

మళ్లీ యధావిధిగా హెడ్రమా జరిగింది. మ్యాటర్ సెటిల్ ఐపోయిందోఅయిపోయిందో ఏమో కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ అటకెక్కేసి.. నాగార్జునతో వర్మ సినిమా మొదలెట్టేసాడు. ఎన్టీఆర్ చివరిరోజుల్లో జరిగిన వైస్రాయ్ హోటల్ ఘటనని నిస్పక్షపాతంగా చూపిస్తానని వర్మ తెలపడంతో లక్ష్మి పార్వతి హ్యాపీ గా ఫీలయ్యారు. చివరకు వర్మ హ్యాండ్ ఇవ్వడంతో వర్మని ఆమె నారదుడితో పోలుస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నారదుడే కిందికి దిగివస్తే వర్మలా ఉంటారని సెటైర్ వేశారు. ఆయన ఒక దారి తప్పిన మేధావి. తన తెలివిని దెయ్యాల సినిమాల కోసం కాకుండా సమాజానికి ఉపయోగ పడే చిత్రాలకు ఉపయోగించాలి అంటూ చురకలు అంటించారు. బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ గురించి కూడా స్పందించారు. బాలకృష్ణ మంచి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

Comments