ప్రచురణ తేదీ : Dec 28, 2016 12:54 PM IST

పవన్ సినిమాలో … నేను నటిస్తున్నా?

kushbu
అప్పట్లో గ్లామర్ హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ తెచ్చుకుని తమిళంలో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన ఖుష్బూ .. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి అక్క చెల్లి పాత్రల్లో నటిస్తూ తన ఇమేజ్ ను కొనసాగిస్తుంది. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవీ నటించిన ”స్టాలిన్” చిత్రంలో కనిపించిన ఖుష్బూ మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించేందుకు ఓకే అయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో ఖుష్బూ కీలకపాత్రలో నటిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇన్నాళ్లకు ఖుష్బూ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో నేను నటిస్తున్నా అంటూ .. ? త్రివిక్రమ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి అత్తా, అమ్మ పాత్రల్లో నటిస్తున్న నదియా ఇప్పుడు సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న ఆర్టిస్టు గా మారిపోయింది. ఆ కోవలోనే ఖుష్బూ కూడా క్రేజ్ తెచ్చుకుంటుందేమో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కలయికలో ‘జల్సా’ , ‘అత్తారింటికి దారేది’ సినిమాల తరువాత హ్యాట్రిక్ హిట్ గా రూపొందే ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ కొవొచ్చినా ఈ సినిమా ఫిబ్రవరిలో మొదలు కానుంది.

Comments