ప్రచురణ తేదీ : Jan 10, 2018 9:24 PM IST

బ్రేకింగ్‌ : క్రిష్‌-4 రిలీజ్ తేదీ ప్ర‌క‌టించిన రోష‌న్‌!

ఇండియాకి సూప‌ర్ హీరో ఎవ‌రు? అంటే ఠ‌కీమ‌ని ఏమాత్రం త‌డుముకోకుండా హృతిక్ రోష‌న్ అని చెప్పేస్తారు ఎవ‌రైనా. అతడు న‌టించిన క్రిష్ సినిమాల ప్ర‌భావం అలాంటింది. ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే మూడు సినిమాలు రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టాయి. కోయి మిల్ గ‌యా, క్రిష్‌, క్రిష్ 3 చిత్రాలు బంప‌ర్ హిట్లు కొట్టాయి. ఈ సిరీస్‌లో నాలుగో సినిమా గురించి ద‌ర్శ‌క‌నిర్మాత రాకేష్ రోష‌న్ చాలా కాలంగానే క‌స‌ర‌త్తు చేస్తున్నారు. క‌థ గురించే ఎంతో కాలంగా ఆయ‌న గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఈపారిటికే మొద‌లు కావాల్సి ఉన్నా.. ఎందుక‌నో చాలానే ఆల‌స్య‌మైంది. ఇన్నాళ్టికి రోష‌న్‌లో ఓ క్లారిటీ వ‌చ్చిన‌ట్టుంది. అత‌డు లేటెస్టుగా క్రిష్ -4 రిలీజ్ తేదీని ప్ర‌క‌టించాడు.

హృతిక్ రోష‌న్ అభిమానులు ఖుషీ అయ్యేలా సూప‌ర్ హీరో సినిమా క్రిష్ -4ని తెర‌కెక్కించ‌నున్నాము. 2020 క్రిస్మ‌స్‌కి ఈ సినిమా రిలీజ్ చేస్తాం. ఆ రోజే రిలీజ్ చేయ‌డానికి ప్ర‌త్యేక‌కార‌ణం ఉంది. ఆరోజు హృతిక్ పుట్టిన‌రోజు.. అనీ రాకేష్ రోష‌న్ తెలిపారు. హృతిక్ 43వ బ‌ర్త్ డే ఆరోజు కానుక‌గా క్రిష్ -4 ని అందిస్తున్నాన‌ని తెలిపారు. వాస్త‌వానికి గ‌త‌ సెప్టెంబ‌ర్‌లో 2018 చివ‌రి నాటికే క్రిష్ 4 పూర్త‌వ్వాల్సి ఉన్నా.. అనుకోని కార‌ణాల‌తో వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు ఈ క్రేజీ సినిమా రిలీజ్ విష‌య‌మై రాకేష్ లో క్లారిటీ వ‌చ్చిన‌ట్టే.

Comments