ప్రచురణ తేదీ : Thu, Sep 29th, 2016

పదింటిలో ఒకటి పవన్ కే..!

koratala-shiva-and-pawan
కొరటాల శివ ప్రస్తుతం అగ్రదర్శకుల జాబితాలో చేరిపోయారు.ముగ్గురు పెద్ద స్టార్ లతో చేసిన మూడు చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ప్రభాస్ తో చేసిన మిర్చి, మహేష్ బాబుతో చేసిన శ్రీమంతుడు. ఎన్టీఆర్ తో చేసిన శ్రీమంతుడు భారీవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. జనతా గ్యారేజ్ చిత్రం విడుదల అనంతరం తనదగ్గర పదికథలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించాడు.ఆ పదింటిలో ఓ కథ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కోసం కొరటాల శివ ముస్తాబు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం కొరటాల శివ మహేష్ బాబుతో చిత్రం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.ఈ చిత్రం జనవరిలోనే ప్రారంభమయ్యె అవకాశం ఉంది.దీనితో పాటే పవన్ కళ్యాణ్ తో చేయబోయో కథకు మెరుగులు దిద్దుతాడని అంటున్నారు.బలమైన సోషల్ ఎలిమెంట్స్ తో కూడిన కథని కొరటాల సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్ కనుక సెట్ ఐతే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం.

Comments