ప్రచురణ తేదీ : Sat, Mar 17th, 2018

కొరటాల నెక్స్ట్ సినిమా ఆ హీరోతోనే ?

ఒక సినిమాను మించి మరో సినిమాతో సంచలన విజయాలు అందుకున్న దర్శకుడు కొరటాల శివ అంటే ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ క్రేజ్. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూ లో ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా తెరకెక్కిస్తున్న కొరటాల ఈ సినిమాను పూర్తీ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం లండన్ లో ఓ షెడ్యూల్ జరుగుతుంది. ఏప్రిల్ 20న విడుదల కానుంది. ఈ సినిమాతో అయన మార్కెట్ కూడా ఓ రేంజ్ లో పెరుగుతుందని అంటున్నారు. ఇక కొరటాల నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న ఆసక్తి ఎక్కువైంది. ఇప్పటికే పలువురు హీరోల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఫైనల్ గా నానితో సినిమా చేస్తాడని అంటున్నారు. ఇదివరకే రామ్ చరణ్ తో సినిమా చేయాలనీ కమిట్ అయ్యాడు, కానీ ప్రస్తుతం చరణ్ – బోయపాటి శ్రీను తో ఓ సినిమా చేస్తున్నాడు, అది పూర్తయ్యే వరకు నాని సినిమా తెరకెక్కిస్తాడట. మహేష్ సినిమా పూర్తవ్వగానే నాని సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. వరుస విజయాలతో జోరుమీదున్న నానితో సినిమాలు తీయాడనికి అటు దర్శకులు కూడా క్యూ కడుతున్నారు మరి.

Comments