ప్రచురణ తేదీ : Sat, Jan 7th, 2017

ఎప్పటికీ నాకు ధోనీనే కెప్టెన్ అంటున్న కోహ్లీ

KOHLI
అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో ధోనిని మించిన వాళ్ళు ఉండరు. టెస్ట్ కెప్టెన్సీ వదులుకోవడం దగ్గరనుండి ఇప్పుడు వన్డే, టీ 20 కెప్టెన్సీ వదులుకోవడం వరకు ధోని తీసుకున్నవన్నీ ఆశ్చర్యకర నిర్ణయాలే. ధోని కెప్టెన్సీ వదులుకోవడం అతని అభిమానులకు ఇష్టంలేదు. కానీ అతను నిర్ణయం తీసేసుకున్నాక ఇంకేం చేయలేము అని ఊరుకున్నారు. మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు కూడా ధోని ఈ నిర్ణయం ప్రకటించాక అతనికి మద్దతు తెలిపారు. ధోనికి ఎప్పుడేం చేయాలో బాగా తెలుసని వారంతా ముక్త కంఠంతో చెప్తున్నారు.

ధోని నుండి కెప్టెన్సీ అందుకోబోతున్న కోహ్లీ… ధోని గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. తన కెరీర్ మొత్తం ధోని నేతృత్వంలోనే ఆడిన కోహ్లీ 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ లో అరంగేట్రం చేసాడు. అయితే తన కెరీర్ తొలిరోజుల్లో తనకు నిలకడ లేకపోవడంవల్ల జట్టు నుండి తొలగించకుండా ధోని తనను కాపాడేవాడని కోహ్లీ చెప్పాడు. ధోని నుండి తీసుకుంటున్న కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడం అనుకున్నంత సులువు కాదనీ, కెప్టెన్ అంటే అందరికీ ధోనీనే గుర్తుకు వస్తాడని చెప్పాడు. ధోని ఎప్పటికీ తనకు సారథేనని కోహ్లీ స్పష్టం చేసాడు.

Comments