ప్రచురణ తేదీ : Sun, Oct 8th, 2017

కోదండరాం మాస్టారుకి కోపం వచ్చింది! కేసీఆర్ మీద దండకం!

సింగరేణి ఎన్నికల్లో గెలుపు ఇచ్చిన సంతోషం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటికి పని చెప్పింది. తెలంగాణలో తెరాస పరిపాలన మీద పదే పదే విమర్శలు చేస్తున్న తెలంగాణా ఉద్యమ జేఏసీ కన్వినర్ కోదండరాం మీద తీవ్ర పదజాలంతో కేసీఆర్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తెలంగాణ అభివృద్ధిని కోదండరాం అడ్డుకుంటున్నారని, ఆయన తాను తయారు చేసిన ఒక కార్యకర్తఅనే విధంగా మాట్లాడారు. కోదండరాం పోరాటాన్ని, ఆయన ఆలోచనలని తక్కువ చేసి మాట్లాడారు అనేది చాలా మంది మాట.

అయితే తాజాగా కేసీఆర్ తనపై చేసిన విమర్శలకి ప్రతిగా కోదండరాంశ‌నివారం జేఏసీ స‌మావేశాన్ని ఏర్పాటు చేసి, మీటింగ్ ముగిసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగం నుంచి నిర్వాసితుల వ‌ర‌కూ తాము లేవ‌నెత్తుతున్న స‌మ‌స్య‌ల‌పై ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణిలో తనపై విమర్శలు చేయడానికే సమయం అంతా కేటాయించారని అన్నారు. ఆయన మాటలు భావోద్వేగాలని రెచ్చగొడుతూ హింసను పెంచేలా ఉన్నాయని అన్నారు. ఏ ఒక్క‌రో పోరాటం వలనో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేద‌ని.. కోట్లాది మంది ప్ర‌జ‌ల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. ఈ రోజు తాను చేస్తున్న పోరాటం సామాజిక తెలంగాణ కోస‌మే త‌ప్పించి మ‌రో దాని కోసం కాదనే విషయం తెలుసుకోవాలని అన్నారు. ఇలా కోదండరాం మాస్టర్ కేసీఆర్ వాఖ్యాలకి తనదైన శైలిలో తరిగి కౌంటర్ ఇచ్చారు. మరి వారి మధ్య ఈ గొడవ ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి.

Comments