ప్రచురణ తేదీ : Sep 23, 2017 11:58 PM IST

జగన్ కి లెఫ్ట్ అండ్ రైట్.. ఒకరు రోజా ఇంకొకరు ఎవరంటే..?


ఏపీ రాజకీయాలలో ఎన్నికల వేడి కాస్త ముందుగానే మొదలైపోయింది. టీడీపీ పై అటాక్ లో జగన్ అండ్ కో దూకుడు ప్రదర్శిస్తుంటే.. చంద్రబాబు మాత్రం జగన్ కి కోలుకోలేని దెబ్బ తగిలేలా వ్యూహాలు రచిస్తున్నారు. అధికార పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలతో ఏపీలో ఎన్నికల వేడి పెరిగింది. నంద్యాల, కాకినాడలలో జగన్ పార్టీకి గట్టి షాకే తగిలింది. దీనితో వైసిపి నిర్వీర్యం కావడం ఖాయమని అంతా భావించారు. కానీ అదే దూకుడిని ప్రదరిస్తున్న జగన్ పార్టీ నేతలు మాటల యుద్ధంలో టీడీపీకి గట్టి పోటీనిస్తున్నారు.

టిడిపితో మెటల్ యుద్ధంలో వైసిపి నేతలు రోజా, కోడలి నాని లు జగన్ కు కుడి ఎడమ భుజాల వంటి వారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఘాటు విమర్శలు చేయడంలో ప్రత్యర్థులకు సవాల్ విజేశారదాం లో వీరి తరువాతే ఎవరైనా. నంద్యాల ఫలితం తరువాత రోజా కాస్త మెత్తబడ్డట్లు కనిపిస్తున్నా.. కోడలి నాని మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా నాని చేసిన వ్యాఖ్యలు ఎపి పొలిటికల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. టిడిపి నేత రావి వెంకటేశ్వరరావు కు నాని సవాల్ విసిరారు. నన్ను గుడి వాడాలో ఓడించే దమ్ము ఉందా.. ఒక వేళ తాను గుడివాడలో ఓడిపోతే రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని అన్నారు. తన సవాల్ ని స్వీకరించడానికి తెలుగు దేశం పార్టీ నేతలు ముందుకు రావాలని స్పష్టం చేసారు.

కాగా కొడాలి నాని వలివర్తిపాడు ప్రాంతంలో ప్రభుత్వ భూములని బినామీలతో ఆక్రమించాడని టీడీపీ నేత రవి వెంకటేశ్వర రావు ఆరోపణలు చేయడంతో వీరి మధ్య విమర్శలు మొదలయ్యాయి.

Comments