ప్రచురణ తేదీ : Sat, Aug 12th, 2017

దమ్ముంటే నన్ను పట్టుకోండి! చేతకాకుంటే నా లవర్ ని వదలండి!


రాజస్థాన్ లో ఓ వ్యక్తి పోలీసులకు తలనొప్పిగా మారాడు. తాను చేసిన నేరాన్ని సవాల్ విసురుతూ.. దమ్ముంటే నన్ను పట్టుకోండి అని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. తన గర్ల్ ఫ్రెండ్ కోసం రాక్షసుడిగా మారిన వ్యక్తి కథ అక్కడ జనాలను చాలా ఆశ్చర్యానికి గురి చ్చేస్తోంది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. రాజస్థాన్‌లోని గంగానగర్‌కు చెందిన ఇందుబాల అనే యువతి దీపక్ మాలిక్‌కు స్నేహితురాలు.

అయితే ఆమెను గత కొంత కాలంగా హర్యానాకు చెందిన తన మాజీ ప్రియుడు వినోద్ చాలా దారుణంగా వేధిస్తున్నాడని స్నేహితుడైన దీపక్ మాలిక్‌కు తెలిపింది. దీంతో దీపక్ , కొన్ని రోజుల క్రితం వినోద్ ని చంపేసి పోలీసులకు దొరక్కకుండా వివిధ ప్రాంతాలనుండి సోషల్ మీడియాలో సవాల్ విసురుతున్నాడు. నా స్నేహితురాలి మాజీ లవర్ ని తుపాకీతో కాల్చి చంపాను దమ్ముంటే పట్టుకొండని ఛాలెంజ్ విసరడంతో పోలీసులు అతన్ని పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం అతని స్నేహితురాలైన ఇందుబాల ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Comments