ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

బాహుబలి రికార్డును మిస్సయిన .. ఖైదీ?

kaidhi150
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ భారీ అంచనాల మధ్య విడుదలైన ”ఖైదీ నంబర్ 150” సినిమా మెగా ఫాన్స్ కు మంచి ఊపునిచ్చింది. తొమ్మిదేళ్ల తరువాత చిరంజీవికి మంచి రీ ఎంట్రీ దొరికిందని అంటున్నారు సినిమా చుసిన జనాలు. ఇక టాలీవుడ్ లో మెగాస్టార్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న మెగాస్టార్ సినిమా అన్ని రికార్డులను తిరగరాస్తుందని అనుకున్నారు. ముఖ్యంగా ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొడుతుందని అనుకున్నారు, కానీ జెస్ట్ లో మిస్ అయింది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు బాహుబలి రికార్డులే మొదటి స్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సెస్ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు భారీ వసూళ్లు ”బాహుబలి”వె, ఆ తరువాత స్థానాన్ని ఖైదీ దక్కించుకున్నాడు. బాహుబలి 1.3 మిలియన్ డాలర్స్ వసూళ్లతో ప్రధమ స్థానంలో ఉంటె .. ఖైదీ సినిమా 1. 25 డాలర్స్ (అంటే దాదాపు 8. 56 కోట్ల) రూపాయలు వసూలు చేసి మెగాస్టార్ సత్తా చాటింది?

Comments