ప్రచురణ తేదీ : Jan 20, 2017 3:23 PM IST

ఖైదీ యూనిట్ పై .. ఐటి దాడులు !!

khaidi150
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటించిన ”ఖైదీ నంబర్ 150” వ సినిమా సంక్రాంతిగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంటూ దూసుకుపోతుంది. మెగాస్టార్ క్రేజ్ ఇంకా తగ్గలేదని ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఇక ఈ సినిమా కేవలం వారం రోజుల్లో 108 కోట్ల గ్రాస్ వసూలు చేసి దుమ్ము రేపుతున్నట్టు తెలిసింది. అయితే తక్కువ సమయంలోనే ఈ సినిమా ఇలా భారీ స్థాయిలో వసూళ్లు సాధించడంతో ఐటి కన్ను ఈ సినిమా యూనిట్ పై పడిందట !! కలక్షన్స్ వసూలు చేసిందే తడవుగా ఈ సినిమా యూనిట్ సభ్యులైన అల్లు అరవింద్, వినాయక్, దేవి శ్రీ ప్రసాద్, రత్నవేలు, కాజల్ ల ఇళ్ల పై ఐటి దాడులు జరిగినట్టు తెలుస్తోంది ? ఈ సినిమాకోసం వీరు భారీ రెమ్యూనరేషన్స్ తీసుకున్నారని, ఈ సినిమా కూడా భారీ వసూళ్లు సాధించడంతో ఐటి దాడి జరిపినట్టు తెలుస్తోంది. మరి ఎవరిళ్ళలో ఏమి దొరికిందో తెలియాల్సి ఉంది.

Comments