ప్రచురణ తేదీ : Dec 3, 2017 4:03 PM IST

రామ్ సెంటిమెంట్ ను కీర్తి వర్కవుట్ చేస్తుందా ?

వరుస పరాజయాలతో ఉన్న హీరో రామ్ కు నేను శైలజ సినిమా సంచలన విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రామ్ అటు ఫ్యామిలీ ప్రేక్షకులు దగ్గరయ్యాడు. ఆ తరువాత వచ్చిన సినిమాలు మళ్ళీ వరుస ప్లోప్ లతో టెన్షన్ పెట్టాయి. అందుకే మళ్లీ తన కెరీర్ కు సరైన సక్సెస్ తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టాడు రామ్ .. అందుకే ఈ సారి త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పాడు. దాంతో పాటు రామ్ కు కీర్తి సురేష్ కూడా మంచి హిట్ పెయిర్ గా నిలవడంతో ఆమెను ఈ సినిమాకోసం రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకోసం కీర్తి సురేష్ తో చర్చలు జరుపుతున్నారట. పైగా దర్శకుడు త్రినాధ్ రావు కూడా కీర్తి తో నేను లోకల్ చేసాడు కాబట్టి .. ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పడం ఖాయం అని అనుకుంటున్నారు. అయితే కీర్తి సురేష్ ఇంకా ఈ సినిమాకు ఓకే చెప్పలేదట. ఎందుకంటే ఇప్పటికే మహానటి, అజ్ఞాతవాసి, రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉంది .. మరి రామ్ సినిమాకు టైం ఇస్తుందో లేదో చూడాలి.

Comments