ఇప్పట్లో ఫలించేలా లేని కె సి ఆర్ కల!

ఎన్నో సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి చివరకు తెలంగాణ దిగ్విజయంగా సాధించి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గలిగిన భాగ్య నగరం మీద, రాష్ట్రం మీద తనదైన చెరగని ముద్ర వేశారు ముఖ్యమంత్రి కె సి ఆర్. అయితే ఆయన కు ఒక కోరిక వుంది , ఐకానిక్ భవనాలు నిర్మించి అందులో సచివాలయం లాంటివి నెలకొల్పి తనపేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకోవాలనేది ఆయన కల. అందుకు అనేక ప్రయత్నాల తర్వాత నేడో, రేపో కొత్త సచివాలయ భావన నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి అనుకున్న తరుణంలో మనకు అందుతున్న వార్తల ప్రకారం ఆయన కోరిక ఇప్పట్లో తీరేట్లు కనిపించడం లేదు. ఆయనకు ప్రస్తుతమున్న సచివాలయం నచ్చలేదని, ఉమ్మడి రాష్ట్రం గా వున్నపుడు ముఖ్యమంత్రులు అయినవారి వారసులు ఎవరూ మళ్లి సి ఎం కాలేరు అన్న సెంటిమెంట్ ని ఆయన బలంగా నమ్మడం ఒకవైపు, వాస్తు దోషాల సమస్య మరొక వైపు ఉండడం వల్ల ఆయన పాత సచివాలయానికి రావడమే మానేశారని , ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు మూడు, నాలుగు సార్లు మాత్రమే వచ్చి వెళ్లారని అధికారులు అంటున్నారు.

సచివాలయం ఒక ఐకానిక్ బిల్డింగ్ గా కాట్టాలనుకున్న ఆయన సికింద్రాబాద్ లోని బైసన్ పోలో గ్రౌండ్స్ ఎంచుకున్నారు. అది రక్షణ శాఖ వారిది కావడం తో దానికొరకు చాలా ప్రయత్నాలు చేసి చివరకు వారికి ఆ స్థలం బదులుగా నగరం వెలుపల ఒక విశాల స్థలం ఇస్తామని చెప్పి ఒప్పించారు , అయితే స్థలం అప్పగింతలు ఇంకా పూర్తికాలేదు. ఇప్పుడు వున్నట్లుండి ఒక పెద్ద అవాంతరం వచ్చి పడింది మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వారు కూడా తమ రాష్ట్ర అవసరాల నిమిత్తం రక్షణ శాఖకు చెందిన స్ధలాలు కావాలని, అది కూడా వందల ఎకరాలు కావాలని కేంద్రానికి విజ్ఞప్తులు పంపారట. వస్తున్న మిగిలిన విజ్ఞప్తులు పక్కన పెట్టి తెలంగాణ వారికి అడిగిన స్థలం కేటాయిస్తే గొడవ అవుతుందని, ఒకవేళ ఆలా అడిగిన వారికి అడిగినట్లు రక్షణ శాఖ స్థలాలు ఇచ్చుకుంటూ పోతే చాలా పెద్ద గొడవే అవుతుందని కేంద్రం ప్రస్తుతానికి ఈ విజ్ఞప్తులు హోల్డ్ లో పెట్టిందని సమాచారం. ఏది ఏమైనప్పటికి కొత్త సచివాలయ నిర్మాణ వ్యవహారం మళ్లి మొదటికి వచ్చినట్లే . ఈ పరిస్థితుల్లో పాత భవనాలు నచ్చకపోతే అదే స్థలం లో కొత్తవి నిర్మించుకోవడమేతప్ప కొత్త స్ధల కేటాయింపు ఇప్పట్లో లేనట్లే అని విశ్లేషకులు అంటున్నారు.

Comments