ప్రచురణ తేదీ : Fri, Jan 6th, 2017

ప్ర‌యివేటు కాలేజీల‌పై కత్తిగ‌ట్టిన కేసీఆర్

kcr1
ప్ర‌యివేటు విద్యావ్య‌వ‌స్థ‌లో ఉన్న ఫీజుల దందా మెడ‌కి గుదిబండ‌లా చుట్టుకోవడాన్ని కేసీఆర్ ప్ర‌భుత్వం ఏమాత్రం స‌హించ‌లేక‌పోతోంద‌న‌డానికి నిన్న‌టిరోజున అసెంబ్లీ సాక్షిగా సీఎం వ్యాఖ్య‌లే అద్దంప‌డుతున్నాయి. ప్ర‌యివేటు కాలేజీల ప‌నిప‌ట్టేందుకు అన్ని ఆయుధాల్ని రెడీ చేస్తున్న‌ట్టు కేసీఆర్ ప్ర‌క‌టించారు. స‌రైన ఫ్యాక‌ల్టీ లేని కాలేజ్‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి వెన‌కాడ‌బోమ‌ని హుంక‌రించారు. అలాగే అటెండెన్స్ లేని విద్యార్థుల‌కు ఫీజు రీఇంబ‌ర్స్‌మెంట్ లేకుండా చేయాల‌న్న రూల్ ఎలానూ ఉంది కాబ‌ట్టి దానికి మ‌రింత ప‌దును పెట్టేందుకు కేసీఆర్ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. మొత్తానికి ఫీజు రీఇంబ‌ర్స్‌మెంట్ బండ‌ను త‌ప్పించుకునేందుకు వేయాల్సిన ఎత్తుల‌న్నీ కేసీఆర్ వేస్తున్నారు. అయినా మార్చి నెలాఖ‌రునాటికి ఫీజు రీఇంబ‌ర్స్‌మెంట్ బ్యాలెన్స్ మొత్తం 1400 కోట్ల పైచిలుకు చెల్లింపులు చేస్తామ‌ని హామీ ఇచ్చారు కాబ‌ట్టి మొత్తానికి ఆయ‌న ఇరుక్కున్న‌ట్టే అయ్యింది.

ప్ర‌యివేటు విద్య‌పై గుర్రుమీదున్న తెలంగాణ సీఎం అందుకు ప్ర‌త్యామ్నాయ వ్య‌వ‌స్థ‌ను త‌యారు చేయాల‌ని, గ‌వ‌ర్న‌మెంటు విద్య‌ను పున‌రుద్ధ‌రించాల‌ని ఓ ప్ర‌య‌త్నం చేస్తార‌ని అంతా భావించారు. అయితే అదేమీ అంత వీజీ కాద‌ని సీఎం కాల‌క్ర‌మంలో అర్థం చేసుకున్న వైనం బ‌య‌ట‌ప‌డుతోంది. ఇక డీఎస్సీ పోస్టింగులే చేయ‌లేని చేత‌కాని సీఎంగా నిరుద్యోగుల్లో కేసీఆర్ చాలా బ్యాడ్ అయిపోయారు. ప‌రిణామాల‌న్నీ సీఎంకి వ్య‌తిరేకంగా మారిపోతున్నాయిప్పుడు.

Comments