ప్రచురణ తేదీ : Dec 7, 2017 10:16 PM IST

ఓరి దేవుడో! చావు క‌ళ్ల‌లో క‌ళ్లు పెట్టి చూసింది!!

సాహ‌స‌నారి క‌త్రిన కైఫ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే! ఈ అమ్మ‌డి సాహ‌స‌విన్యాసాలకు అడ్డూ అదుపూ లేనేలేదు. ధూమ్ -3, బ్యాంగ్ బ్యాంగ్ లాంటి భారీ యాక్ష‌న్ చిత్రాల్లో క‌ళ్లు చెదిరే జిమ్నాస్టిక్ ఫీట్స్‌తో అద‌ర‌గొట్టేసింది. కార్ ఛేజ్‌, బైక్ ఛేజ్‌, ప్యారాచూట్ జంప్‌, స్కై డైవింగ్‌, డీప్ సీ డైవింగ్ .. ఒక‌టేమిటి ఎలాంటి సాహ‌సానికైనా తెగించే హీరోయిన్‌గా అభిమానుల మ‌న‌సు దోచింది.

అదంతా స‌రే కానీ, టైగ‌ర్ జిందా హై కోసం క‌త్రిన వేసిన ఓ ఫీట్ ఒళ్లు గ‌గుర్పొడిచేలా సాగిందిట‌. అంతేకాదు ఓ భారీ ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకుంది క్యాట్‌. ఓ కార్ ఛేజ్ స‌న్నివేశంలో ఓ ఇరుకు సందు లాంటి రోడ్‌లో .. గూగుల్ మ్యాప్‌కి చిక్క‌ని సందులాంటి మార్గంలో భారీ యాక్సిడెంట్ జ‌రిగింది. అత్యంత వేగంగా వెళుతున్న క‌త్రిన కార్ ఏకంగా మార్గ‌మ‌ధ్యంలోని గోడ‌ను బ‌లంగా ఢీకొట్టింది. ఆ క్ష‌ణం ప్రాణం పోయింద‌నే అనుకుందిట‌. తృటిలో మృత్యుముఖం నుంచి ఎస్కేప్ అయ్యాన‌ని క్యాట్ చెబుతోంది. మొరాకోలో జ‌రిగిన షూటింగులో ఇలా జ‌రిగింద‌ని చెప్పుకొచ్చింది. అయితే ఈ యాక్సిడెంట్ ఎలా జ‌రిగింది? అంటే ముందుగా స‌ల్మాన్ ఖాన్ గుర్రంపై దౌడు తీయిస్తూ పారిపోతుంటాడు. అత‌డి వెంటే తాను కార్లో ఛేజ్ చేస్తుంటుంది. అలా వెళ్లేప్పుడు సందులాంటి ప్లేస్‌లో తాను యాక్సిడెంట్‌కి గురైంది. అయితే ఆ స‌మ‌యంలో అక్క‌డికి వ‌చ్చిన యూనిట్ స‌భ్యులు అంతే బెంబేలెత్తారుట‌. క‌త్రిన వెళుతున్న కార్ టాప్‌లో అమ‌ర్చిన ఖ‌రీదైన కెమెరాకి ఏం జ‌రిగిందోన‌న్న బెంగ‌తో యూనిట్ బెంబేలెత్తిందిట‌. అంత హారిబుల్ స‌న్నివేశంలో తన‌కేమైందో అని బాధ‌ప‌డుతున్న వేళ యూనిట్ స‌భ్యులు అలా ప్ర‌వ‌ర్తించార‌ని చెప్పింది. ఏదేమైనా ఎస్కేపైంది. లేదంటే అభిమానుల గుండెలు చిద్ర‌మ‌య్యేవే!! ప్చ్‌!!

Comments