ప్రచురణ తేదీ : Jan 13, 2018 12:06 PM IST

వెయిట్ చేయండి.. ఆ రోజు అన్ని తెలుస్తాయి : కత్తి మహేష్

జనసేన అధినేత సినీహీరో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసి ఫెమస్ అయిన కత్తి మహేష్ కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగత విమర్శలను కొంచెం పక్కన పెట్టిన కత్తి రీసెంట్ గా అజ్ఞాతవాసి చెత్త సినిమా అని దాదాపు రెండు గంటల రివ్యూ ఇచ్చాడు. అయితే ఈ రివ్యూపై కూడా పవన్ ఫ్యాన్స్ కొంత మంది నెగిటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కత్తి మహేష్ ట్విట్టర్ ద్వారా ఒక విషయాన్ని తెలిపాడు. జనవరి 15 వరకు అందరు సైలెంట్ గా ఉండాలని ఆ తరువాత సమస్య పరిష్కారం అవుతుందని ట్వీట్ చేశాడు. అంతే కాకుండా మరికొన్ని రోజుల్లో థియేటర్లను బట్టి ఏ సినిమా సంగతి ఏంటన్న విషయాన్ని జనవరి 16న తేలుతుందని అర్ధం వచ్చేలా ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్న బాలయ్య సినిమా కూడా బాగాలేదంటూ ట్వీట్ చేసి నందమూరి అభిమానులకు కూడా కత్తి మహేష్ కోపాన్ని తెప్పించాడు. మొత్తానికి తన అభిప్రాయం అంటూ ఇతరుల ఆగ్రహాన్ని పరీక్షిస్తూ జనవరి 16వరకు ఓపిక పట్టాలని అంటున్నాడు. మరి ఆ తరువాత మహేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Comments