ప్రచురణ తేదీ : Sat, Jan 13th, 2018

కత్తిని వెంబడించిన పవన్ ఫాన్స్!

ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా తన విమర్శల దాడి కాస్త తగ్గించిన కత్తి మహేష్ పవన్ ఫాన్స్ పై మరొక ఆరోపణ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ వేడుకలకు తన స్వగ్రామం పీలేరుకు బయలుదేరిన తాను ఇప్పుడే తమ గ్రామానికి చేరుకున్నానని, తనని దారి మధ్యలో పీలేరుకు సమీపంలోకి చేరుకోగానే ఇద్దరు బైకర్లు వెంబడించారని, అంతేకాక వారు జై పవన్ కళ్యాణ్ అని నినదించారని ఆయన అన్నారు. అయితే తనకు ఇంటికి వచ్చాక అసలు విషయం ఒకటి అర్ధం అయిందని, ఇటీవల తనకోసం విజయవాడ, పుత్తూరు, మరియు తిరుపతి వంటి ప్రాంతాల నుంచి కొంత మంది పవన్ ఫాన్స్ తమ గ్రామానికి వచ్చి తన కోసం వెతికినట్లు ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని కొద్దిసేపటిక్రితం ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

Comments