ప్రచురణ తేదీ : Mon, Apr 23rd, 2018

పవన్ ఒక అరాచక శక్తి.. డోస్ పెంచిన కత్తి మహేష్!

పవన్ అభిమానులు పవర్ స్టార్ ని రోజు ఎన్ని సార్లు తలచుకుంటారో చెప్పలేం గాని కత్తి మహేష్ మాత్రం వారికంటే ఎక్కువగా పవన్ పై స్పందిస్తాడు అనేది నిజం. పవన్ అడుగు వేయడమే ఆలస్యం ఏ సైడ్ నుంచి విమర్శించడానికి పాయింట్స్ దొరుకుతాయా అని మహేష్ ఎదురుచూస్తాడు అనేది అందరికి తెలిసిందే. పవన్ ఆర్థిక సహాయం గురించి మాట్లాడని కత్తి ఆయన చేసే పనులపై నిత్యం నెగిటివ్ కామెంట్స్ చేయడం సర్వసాధారణంగా మారింది. రాను రాను ఆ డోస్ ఇంకా పెరిగింది. అయితే కత్తి ఎన్ని కామెంట్స్ చేసిన పవన్ వాటిని పట్టించుకోడు అనేది అందరికి తెలిసిందే.

ఇక ఈ సారి కత్తి ముందడుగేసి ఫెస్ బుక్ ద్వారా పవన్ ఒక అరాచక శక్తి అంటూ పెద్ద కామెంట్ పెట్టాడు.

పవన్ కళ్యాణ్ : రాజకీయాలలో ఒక అరాచక శక్తి ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు నా మీద కోడిగుడ్లతో దాడి చేసిన యువకులు. నా మీద దాడిని ఏనాడూ ఖండించని పవన్ కళ్యాణ్ దాడి చేసిన అభిమానులను పిలిచి మరీ అభినందించడం దేనికి చిహ్నం? మొన్నటికి మొన్న ఫిల్మ్ ఛాంబర్ కి అభిమానుల్ని పిలవడం వెనక దాగున్న మతలబు, అమ్మ సెంటిమెంటుని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలని సాధించడం కాదా! అభిమానుల కోసం పవన్ అక్కడికి రాలేదు.

తన అక్కసు వెళ్లగక్కడానికి. మా అసోషియేషన్ ను టెర్రరైజ్ చేసి. మీడియా మీద వార్ ప్రకటించడానికి వచ్చాడు. అభిమానుల ఆవేశాన్ని తన ఆయుధం గా మలుచుకోవడానికి ప్లాన్ వేసుకునే వచ్చాడు. అక్కడ జరిగింది అదే. ఆంధ్రజ్యోతి వాహనాల మీద దాడి. దాడి చేసిన అభిమానుల్ని అరెస్టు చేస్తే, వాళ్ళని విడిపించడం మానుకుని, అది కూడా మీడియా ఆరాచకమే అని కలర్ ఇస్తున్నాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఏకం చేసి, వివిధ ప్రదేశాలలో అభిమానులను రెచ్చగొట్టే ప్రసంగాలని చేయిస్తున్నాడు.

అన్నపూర్ణ స్టూడియోలో 24 క్రాఫ్ట్స్ మీటింగ్ అని పిలిచి. అభిమానులు అక్కడా హంగామా చేసేలా చేసి, పవన్ మాత్రం రాకుండా, మీడియాని అభిమానుల్ని తప్పుదోవ పట్టించాడు. దీని వెనక ఒక హింసాత్మక కుట్ర పునాది దాగుందని నాకు అనిపిస్తే అది నా తప్పే అవుతుంది. కానీ ఈ ఫోటో చూసాక, అది అసాధ్యం కాని కుట్ర అనిపించి రాస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కోసం చస్తాం. చంపుతాం అనే యువత ఎంతలేదన్నా ఒక 10 నుంచీ 20 వేల మంది ఉంటారు. పవన్ కి వ్యతిరేకం అనుకుంటున్న మీడియా మీద. పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేని మనుషుల్ని అటాక్ చెయ్యడానికి.రాష్ట్ర వ్యాప్తంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలజడికి సృష్టించడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కుట్ర ఇది.

మీడియా ప్రముఖుల పేర్లు, ఫోటోలు బయటపెట్టి బెదిరించడం వెనక. నాలాంటి వాళ్ళ ఇంటి అడ్రస్సులు వాళ్ళ చెంచాల ద్వారా బయట పెట్టించడం వెనక ఇదే కుట్ర ఉంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం సృష్టింపబడుతుంది. పవన్ ను పిచ్చిగా అభిమానించే కాపు-దళిత యువకులు ఈ కుట్రలో సమిధలు అవుతారు. చంద్రబాబు ప్రభుత్వం ఇరుకున పడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధిస్తుంది. మధ్యంతర ఎన్నికలు వస్తాయి. పవన్ కళ్యాణ్ కింగ్ అవొచ్చు. లేదా కింగ్ మేకర్ అవొచ్చు అని కత్తి మహేష్ పోస్ట్ చేశాడు.

Comments