ప్రచురణ తేదీ : Jan 29, 2018 10:56 AM IST

పవన్ పై కత్తి మహేష్ మరొక ట్వీట్ ?

సినీ విశ్లేషకులు కత్తి మహేష్ కు పవన్ ఫాన్స్ కు మధ్య చాలా కాలం వివాదం జరిగిన విషయం తెలిసిందె. చివరకు జనసేన కార్యాలయం నుండి ఒక లేఖ రావడంతో కత్తి మహేష్ శాంతించి వివాదానికి ముగింపు పలికారు .అయితే ఆయన అప్పుడప్పుడు ట్వీట్ ల రూపం లో పవన్ ఉద్దేశించి మాట్లాడుతూనే వున్నారు. ప్రస్తుతం తాను సినిమాలు చేయనని, తన పూర్తి సమయం ఇకపై రాజకీయాలకే కేటాయించాలని నిర్ణయించినట్లు పవన్ చెప్పకనే చెప్పారు. దానిలో భాగంగా ఆయన ప్రస్తుతం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వారిని ప్రత్యక్షంగా కలుసుకునేందుకు రెండు రాష్ట్రాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నది చూస్తున్నాం. అయితే కత్తి మహేష్ చేసిన ఒక ట్వీట్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అన్నట్లు చెపుతున్నారు. తంత్రం లేని సేనాని, యుద్ధం లేని సైన్యం. సమస్య ఇంకా బేసిక్ లెవెల్లోనే వుంది, ఇప్పటికి ఇంకా ఏమి ఆలస్యం కాలేదు. ఏదో ఒకటి చేయొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పంట పొలాల వైపు వచ్చేలోగా ఎంతో కొంత మార్చవచ్చు అనేది ఆయన ట్వీట్ సారాంశం. ఏది ఏమైనప్పటికి కొన్నాళ్ళనుండి చల్ల బడిన కత్తి మాటలు పవన్ అభిమానులను కొంత మేర ఆలోచనలో పడేశాయని విశ్లేషకులు అంటున్నారు.

Comments