ప్రచురణ తేదీ : Sep 30, 2016 12:30 PM IST

అలా జరిగితే చచ్చిపోతానంటున్న కరీనా ?

kareena-kapoor1
అదేంటీ కరీనా కపూర్ అంత మాట అనేసింది అని షాక్ అవుతున్నారా ? అదేంటో మరి ..!! అసలు విషయం ఏమిటంటే బాలీవుడ్ లో ప్రేమాయణాలు ఇవాళ కొత్తేమీకాదు, ఎంత విడిపోయినా కానీ లోలోపల ఎక్కడో ప్రేమ ఉంటుందన్నది చాలా సార్లు రుజువు అవుతూనే ఉంటుంది. ఇక బాలీవడ్ హీరో రణబీర్ కపూర్, కరీనాల మధ్య అప్పట్లో ఘాటు ప్రేమాయణం సాగిన విషయం తెలిసిందే. వీరిద్దరూ విడిపోయిన తరువాత కరీనా, సైఫ్ ని వివాహం చేసుకుంది, రణబీర్ మాత్రం .. కత్రినాతో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇక ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో కరీనా ను ఓ ప్రశ్న అడిగారు .. దానికి ఆమె చెప్పిన సమాధానం విని అందరు షాక్ అయ్యారు ? ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటో తెలుసా .. ఒకవేళ మీరు కత్రినాతో కలిసి రణబీర్ లిఫ్ట్ లో వెళ్తూ .. అక్కడే ఇరుక్కుంటే ఎం చేస్తారు ? అని అడిగితె .. వెంటనే తడుముకోకుండా అదే జరిగితే నా ప్రాణం నేనే తీసుకుంటా అని చెప్పి షాక్ ఇచ్చింది ? కరీనా ఇంత ఘాటు సమాధానం విని అందరు అవాక్కయ్యారు. మొత్తానికి కరీనా వ్యవహారం మాత్రం అందరికి షాక్ ఇస్తుంది మరి !!

Comments