ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

క‌ర‌ణం ఎమ్మెల్సీ ప‌ద‌వికి నోటి దుర‌ద పెట్టిన ఎస‌రు!!

Karanam-balaram
ప్ర‌కాశం జిల్లా అంటే క‌ర‌ణం! క‌ర‌ణం అంటే ప్ర‌కాశం జిల్లా!! అంత‌గా పాపులారిటీ ఉన్న నేత‌. అయితే ఇటీవ‌లి కాలంలో సీన్ సితారైపోయింద‌న్న‌ది తేదేపా ఇన్‌స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట‌. తోడ‌ల్లుడిని సైతం లెక్క‌జేయ‌క నాడు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇప్పించిన చంద్ర‌బాబునే క‌ర‌ణం ఎదురిస్తున్నారు. అన‌కూడ‌ని మాట‌లు అంటున్నారు. జిల్లాలో ఆయ‌న దందా ఓ రేంజులో సాగుతోంది. ఈ ప‌రిస్థితులు క‌ర‌ణం బ‌ల‌రాంపై బాబు కోపానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని స్థానికులు చెప్పుకుంటారు. క‌ర‌ణం దూకుడు కొన్ని చిక్కుల్ని తెచ్చి పెడుతోంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న ప్రాధాన్య‌త పార్టీలో త‌గ్గ‌డానికి కార‌ణం అదేన‌ని చెబుతున్నారు. జిల్లా టీడీపీ అంటే క‌ర‌ణం.. అయితే అది ఒక‌ప్పుడు అంటూ చెవులు కొరుక్కుంటోంది పార్టీ కేడ‌ర్‌.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ప్ర‌కాశం జిల్లా – ఒంగోలు ఎమ్మెల్యే తేదేపా అధ్య‌క్షుడు దామ‌చ‌ర్ల జ‌నార్థ‌న్ ఎలా చెపితే అలా న‌డుచుకుంటున్నార‌ని, క‌ర‌ణంని బాబు ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని చెప్పుకుంటున్నారు. అంతేకాదు త్వ‌ర‌లోనే ఎమ్మెల్సీ ప‌ట్టా అందించే స‌న్నివేశం ఉంది. ఇలాంటి వేళ క‌ర‌ణంకి బాబు ఆ ప‌ద‌విని క‌ట్ట‌బెడ‌తారా? అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. 2009లో క‌ర‌ణంకి, 2014లో ఆయ‌న కొడుక్కి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చిన బాబు ఈసారి మాత్రం పూర్తిగా ప‌క్క‌న పెట్టేసే ఛాన్సుంద‌ని చెప్పుకుంటున్నారు. అయితే ఈ మొత్తం వ్య‌వ‌హారంలో క‌ర‌ణం నోటి దురుసు ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంద‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు. జ‌స్ట్ వెయిట్ .. ఇంకొద్దిరోజులే అస‌లు సంగ‌తేంటో తేలిపోయే సీన్ వ‌చ్చేస్తోంది.

Comments