ప్రచురణ తేదీ : Wed, Nov 16th, 2016

క్రైమ్ కహాని : చికెన్ ఆలస్య మైందని భార్యను అలా..ఐఫోన్ ఛార్జింగ్ పెట్టి మహిళ ఇలా..!

crime
చికెన్ ఆలస్యమైందని గొంతు కోశాడు : 1-1చికెన్ వాడడం ఆలస్యమైందని భార్యగొంతు కోసి హత్యకు ప్రయత్నించాడు ఓ భర్త. ఈ ఘటన కర్ణాటక లో జరిగింది. పోలీస్ ల కథనం ప్రకారం శివమొగ్గ నగరం లో సురేష్, ఆశారాణి(33) దంపతులు నివాసముంటున్నారు. మద్యానికి బానిసైన ఆశారాణి భర్త సోమవారం చికెన్ తీసుకుని వచ్చి వండమని భార్యకు చెప్పాడు.అప్పటికే సురేష్ మద్యం మత్తులో ఉన్నాడు. తిరిగి వచ్చి చూసేసరికి చికెన్ వండడం ఆలస్యమైందని భార్య గొంతు కోసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీస్ లు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు

2-1
కన్నడ హీరో అరెస్ట్ : కన్నడ హీరో దునియా విజయ్, చిత్ర నిర్మాత సుందర్ ని పోలీస్ లు అరెస్ట్ చేశారు. నిర్మాత సుందర్ బెంగుళూరుకు చెందిన జయరాం అనే వ్యక్తి భార్యని వివాహం చేసుకున్నారు.కొద్దిరోజులకే అదనపు కట్నం కావాలని సుందర్.. జయరాంని వేధించడసాగాడు. దీనితో అదనపు కట్నం ఇవ్వడానికి నిరాకరించడంతో ఓ రోజు హీరో దునియా విజయ్, సుందర్ లు ఇద్దరూ తమ ఇంటికి వచ్చి తన భర్త జయరాం పై దాడిచేశారని జయరాం భార్య పోలీస్ లకు ఫిర్యాదు చేసింది.ఆ దాడిలో తన భర్త గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపింది. దీనితో పోలీస్ లు హీరో దునియా విజయ్ ని, సుందర్ ని అరెస్ట్ చేశారు.

ఫోన్ ఛార్జింగ్ పెట్టి చెయ్యంతా కాల్చుకుంది : 3ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరం లో ఓ మహిళ ఐఫోన్ 7 ని ఛార్జింగ్ పెట్టి నిద్రపోగా లేచి చూసేసరికి ఆమె చెయ్యి కాలి తీవ్రమైన గాయమైంది.ఈ విషయాన్నీ ఆ మహిళే సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తనకు ఇప్పటివరకు ఐఫోన్ పై లాంటి సమస్య లేదని కానీ ఛార్జింగ్ పెట్టి చేతిలో పట్టుకుని నిద్రనించడంవల్ల గాయాల పాలు అయ్యాయని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీనితో అందరూ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు అప్రమత్తంగా మెలగాలని మెలిని అనే మహిళ కోరింది.

Comments