ప్రచురణ తేదీ : Dec 5, 2017 3:07 PM IST

అందుకే దీపికకు మద్దతుగా సంతకం చేయలేదు : కంగనా

ప్రస్తుతం బాలీవుడ్ మూవీ పద్మావతి సినిమా గురించి వివాదాలు ఏ స్థాయిలో చెలరేగుతున్నాయో అందరికి తెలిసిందే. చరిత్రను తప్పుగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో సినిమా రిలీజ్ డేట్ విషయంలో కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకోలేకపోతోంది. ఇప్పటికే సుప్రీమ్ కోర్టులో సినిమాని నిషేదించాలని వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. కానీ రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ లేదు.

ఇకపోతే దీపికకు రక్షణను కల్పించాలని బాలీవుడ్ మొత్తం ఒక్కటై దీపికకు మద్దతుగా ఓ పిటిషన్‌ పై సంతకాలు చేసి ప్రధాని నరేంద్రమోదీకి అందజేయన్నారు. సీనియర్ నటి షబానా అజ్మీ ఆ సంతకాలను సేకరిస్తోంది. అయితే అందరు సంతకం చేయగా నటి కంగనా రనౌత్ మాత్రం సంతకం చేయకపోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కావాలనే కంగనా సంతకం చేయడం లేదని ఆమెకు దీపికా అంటే చాలా కోపమని కొందరు కామెంట్ చేయగా కంగనా స్పందించింది. నేను దీపికకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. ఆమె ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోగలదు. అయితే సంతకం చేయకపోవడానికి కారణం మాత్రం అదికాదు. షబానా ఎప్పుడు ఒకేలా ఉండరు. లెఫ్ట్ అండ్ రైట్ రాజకీయాలు ఆమెకు అలవాటు. అందుకే సంతకం చేయలేదని కంగనా వివరించింది.

Comments