ప్రచురణ తేదీ : Thu, Sep 14th, 2017

కాజల్ అగర్వాల్ కి… రేషన్ కార్డు! కథ కొత్తగా!


కాజల్ కు రేషన్ కార్డు రావడం ఏంటి .. అదికూడా తమిళనాడులో అంటూ షాక్ అవుతున్నారా ? మీరు వింటున్నది నిజమే ? సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ కాజల్ అగర్వాల్ కు తమిళనాడు ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చి తమిళనాడు మహిళగా గుర్తించింది? పైగా అది స్మార్ట్ కార్డు కావడం విశేషం. మరి ఈ విషయం కాజల్ కి తెలిస్తే … ఎగిరి గంతేస్తుందేమో కదా !! ఇకపై రూపాయికి కిలో బియ్యం .. చౌక ధరలకు అన్ని సామానులు కోనేస్తుంది ? సూపర్ కదా !! ఎం చెబుతున్నారు .. కాజల్ కు రేషన్ షాపుకు వెళ్లి సామానులు తీసుకునే అవసరం ఏముంది .. బాగానే రెండు చేతులా సంపాదిస్తుంది కదా ? అని అంటారా .. నిజమే ఆ విషయం మాకు, మీకు తెలుసు.. కానీ తమిళనాడు ప్రభుత్వానికి తెలియలేదుగా ? తాజాగా తమిళ నాడు రెవెన్యూ డిపార్ట్ మెంట్ జారీచేసిన స్మార్ట్ రేషన్ కార్డులో కాజల్ ఫొటోతో ఓ కార్డు రావడం అక్కడి జనాలకు షాక్ ఇచ్చింది. అందులో సరోజ పేరు ఆమెకు సంబందించిన వివరాలు ఉండడంతో ఈ కార్డును సరోజ అనే మహిళా తీసుకుని . .. అందులో కాజల్ ఫోటో చూసి షాక్ అయిందట !! అది విషయం. ఈ మధ్య ఇలాంటి బోగస్ కార్డులు క్రియేట్ చేస్తూ ప్రభుత్వాన్ని పనిగట్టుకుని మోసం చేస్తున్నారు కొందరు ప్రభుద్దులు. అందులో బయటపడింది ఈ విషయం.

Comments