ప్రచురణ తేదీ : Sun, Aug 13th, 2017

రానాతో నా అనుబంధం అంతకు మించి అంటున్న స్టార్ హీరోయిన్!


తెలుగులో స్టార్ హీరోయిన్ అంటే ఇప్పుడున్న వారిలో కొందరి పేర్లు వినిపిస్తాయి. అయితే స్టార్ హీరోలు అందరితో చేసిన కాజల్ కి ప్రత్యెక స్థానం ఉంటుంది. ప్రస్తుతం కాజల్ రానాతో కలిసి నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కాజల్, రానా మధ్య అనుబంధం గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నిజానికి మొదటి నుంచి రానాతో ఎ హీరోయిన్ చేస్తే ఆ హీరోయిన్ తో లవ్ అఫైర్ కట్టేయడం భాగా అలవాటైపోయింది. ఆ లిస్టు లో బిపాసా నుంచి ఇలియానా వారకు అందరు ఉన్నారు. కాని ఇప్పుడు అయితే కాజల్ తో ఎఫైర్ చాలా స్ట్రాంగ్ అనే మాట ఇండస్ట్రీలో భాగా వినిపించింది. అయితే దీనికి తాజాగా కాజల్ ఇం ఇంటర్వ్యూలో భాగంగా క్లేరిటి ఇచ్చే ప్రయత్నం చేసింది. నాకు రానాకి మధ్య ఉన్నదీ స్నేహం మాత్రమె అని. అతనితో కలిసి నటించక ముందు నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ఉందని కాజల్ అన్నట్లు సమాచారం. మా అనుబంధాన్ని అందరు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని, అందరు అనుకున్నట్లు మా ఇద్దరి మధ్య ఎలాంటి అఫైర్ లేదని చెప్పినట్లు సమాచారం.

Comments