ప్రచురణ తేదీ : Jan 30, 2017 11:46 AM IST

30 ఏళ్ల‌లో ఎలాంటి భూక‌బ్జా చేయ‌లేదుట‌!

Kadiyam-Srihari
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి ఓ టీవీచానెల్ లైవ్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు మాట్లాడారు. త‌న 30 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఒక్కటంటే ఒక్క‌ భూక‌బ్జాకి కూడా పాల్ప‌డ‌లేద‌ని, త‌న నిజాయితీనే త‌న‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ రాజ‌కీయాల్లో అవ‌కాశాలు ఇస్తోంద‌ని అన్నారు క‌డియం. అంతేకాదు సీఎం కేసీఆర్ త‌న‌ని దూరం పెట్టార‌న్నది కేవ‌లం స్పెక్యులేష‌న్ మాత్ర‌మేన‌ని త‌న‌కి సీఎంతో చ‌క్క‌ని బాంధ‌వ్యం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. సొంత పార్టీ (తేరాస‌) నేత రాజ‌య్య‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి విష‌యంలో త‌న‌వ‌ల్ల గండం ఏర్ప‌డింద‌న్న దాంట్లో నిజం లేదని, అయితే త‌న వ‌ల్లే అది జ‌రిగింద‌ని రాజ‌య్య అనుకుని ఉండొచ్చ‌ని కూడా క‌డియం వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

మొత్తానికి రాజ‌కీయ‌నేత‌లు భూక‌బ్జాలు ష‌రామామూలే.. నేను మాత్రం అందుకు అతీతుడిని అని క‌డియం శ్రీ‌హ‌రి చెప్ప‌క‌నే చెప్పారు. తెలంగాణ విష‌యంలో చంద్ర‌బాబు విధానాలు న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే తేరాస‌లో చేరాన‌ని కడియం ఈ సంద‌ర్భంగా మ‌రోసారి గుర్తు చేశారు.

Comments