ప్రచురణ తేదీ : Wed, Oct 19th, 2016

క్రైమ్ కహాని : యువి తల్లి పై కోడలి ఆరోపణలు..అందుకే నన్ను కొట్టారు అంటూ..!

యువి తల్లిపై ఆరోపణలు చేసింది ఎవరో తెలుసా ? :1-2 ఆకాంక్ష శర్మ.. గుర్గావ్ కు చెందిన ఈ 25 ఏళ్ల యువతీ నిన్నటివరకు పెద్దగా ఎవరికీ తెలియదు.ఆదివారం రాత్రి ప్రసారమైన బిగ్ బాస్ టివి కార్యక్రమం లో యువరాజ్ సింగ్ తల్లిపై సంచలన ఆరోపణలు చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.తాను గతం లో యువరాజ్ సింగ్ తమ్ముడు జొరావర్ సింగ్ ను వివాహం చేసుకున్నట్లు తెలిపింది. అంతరం తాము విడిపోయామని, యువరాజ్ సింగ్ తల్లి తన అత్త అయిన షబ్నమ్ సింగ్ వల్లే తామిద్దరం విడిపోవాల్సివచ్చిందని సంచలనమైన ఆరోపణలు చేసింది. ఆకాంక్ష శర్మ ఆరోపణలపై స్పందించిన యువి తల్లి మీడియాతో మాట్లాడుతూ,.. భర్తతో విడిపోయిన రెండున్నర ఏళ్ల తరువాత ఇప్పుడు ఎందుకు ఆకాంక్ష మాట్లాడుతోందని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పెళ్లి విషయం కోర్టు పరిధిలో ఉందని అన్నారు.

2-2కబడ్డీ క్రీడాకారుని భార్య ఆత్మహత్య మిస్టరీ : జాతీయ కబడ్డీ జట్టు క్రీడాకారుడు రోహిత్ కుమార్ చిల్లర్ భార్య లలిత తన తండ్రి నివాసం లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త ఆనందం కోసమే తాను మరణిస్తున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది.భర్త నుంచి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తుండడం, భర్త తో తలెత్తిన విభేదాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.గత మార్చ్ లో లలిత.. చిల్లర్ ని రెండో వివాహం చేసుకుంది. వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో గత కొంత కాలంగా ఆమె భర్త నుండి దూరంగా ఉంటోంది. దీనిపై డి ఎస్ పి వవిజయ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.

 

అతడిని కొట్టింది అందుకేనా ? : 3-2ఇటీవల స్కూల్ విద్యార్థుల ఘర్షణ వీడియో ఒకటి నెట్ లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.కొంతమంది విద్యార్థులు కలసి ఓ విద్యార్థిని దారుణంగా కొట్టిన దృశ్యాలు ఆ వీడియో లో ఉన్నాయి. ఆ ఘూర్టీషణలో దాడికి గురైన విద్యార్థి మీడియా కు లేఖ రాశాడు. తన వయస్సు 16 ఏళ్లని, బీహార్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్లు తెలిపాడు. తానూ తరగతి లో అందరికంటే మంచి మార్కులు తెచ్చుకుంటున్నందునే తోటి విద్యార్థులు తనపై దాడి చేసారని తెలిపాడు.తాని దళితుడిని కావడం పైగా అందరికంటే బాగా చదువుతుండడంతో ఓర్వలేకే తనపై దాడిచేసిట్లు ఆ విద్యార్ధి లేఖలో తెలిపాడు. అతడిని కొట్టిన తోటి విద్యార్థులని పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Comments