ప్రచురణ తేదీ : Sat, Aug 12th, 2017

గొడుగు పట్టుకొని ట్రైన్ నడిపాడు.. ఎందుకంటే


రవాణా వ్యవస్థలో మనదేశం ఎంతో అభివృది చెందిందని మన నేతలు, ప్రభుత్వ అధికారులు ఎన్నో గొప్పలు చెబుతారు. అది తెలిసిన విషయమే.. అయితే అభివృద్ధి సంగతి తర్వాత కానీ ప్రస్తుతం ఉన్న కొన్ని ట్రైన్ లను చూస్తే ఎవ్వరికైనా దిమ్మ తిరగాల్సిందే. బుల్లెట్ ట్రైన్ త్వరలనో వస్తుందని చెబుతూ.. ప్రస్తుతం ఉన్న ట్రైన్స్ అసలు ఎలా ఉన్నాయి అని కొంచెం కూడా ఆలోచించారు.

ప్రస్తుతం ఓ ట్రైన్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో రైలు ను నడిపే వ్యక్తి గొడుగు పట్టుకొని రైలును నడపడం చూస్తుంటే ఇక ప్రయాణకుల సంగతి ఏంటో అంటున్నారు జనాలు. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ లోని ఓ పాత రైలు ఎప్పటిదో గాని దానికి చిల్లులు పడి వర్ష ధాటికి లోపల కూడా వర్షం కురవడం మొదలైంది. ఇక రైలును నడిపే వ్యక్తి వర్షంలో పట్టుకోవలసిన గొడుగును రైలులో కూడా పట్టుకొని తడవకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రైల్వే శాఖ మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు.

Comments