ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

తాను నిఖార్సైన రెడ్డిని అంటున్న టిడిపి నేత..!

jc
టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దీ రోజుల క్రితమే ఆయన జగన్ పై చేసిన తీవ్ర విమర్శలు సంచలనం సృష్టించాయి.కాగా బుధవారం ఆయన మరోమారు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. పులివెందులలో అందరూ రెడ్లు కావడంతో గత ఎన్నికల్లో ఎవరూ టిడిపి కి ఓటు వేయలేదని.. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయల సీమకు నీళ్లు ఇస్తుండడంతో 2019 లో అందరూ టిడిపి కే ఓటు వేయాలని జేసీ దివాకర్ రెడ్డి ప్రజలను కోరారు. గతంలో జగన్ ని జేసీ విమర్శించిన నేపథ్యం లో వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అదేస్థాయిలో జేసీపై విరుచుకుపడిన విషయం తెలిసిందే.

కాగా శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలపై జేసీ స్పందించారు.నన్ను నాలుక చీరేస్తా అంటావా ? అంత మొనగాడివా ? అంటూ ఘాటుగా స్పందించారు.ఇక రాయల సీమలో అందరూ రెడ్లు.. రెడ్లు అంటూంటారని, కానీ తాను కంత్రి రెడ్డిని కాదని, నిఖార్సైన రెడ్డిని అని అన్నారు.గతంలో తనని జగన్ బూట్లు తుడిచే చెంచాగాడిని అన్నారని.. అలా అయితే తాను ఎప్పుడో మంత్రిని అయ్యోవాడినని అన్నారు. తాను శ్రీకాంత్ రెడ్డి ఊరికి వస్తానని దమ్ముంటే తనని ముట్టుకోవాలని సవాల్ విసిరారు.

Comments