ప్రచురణ తేదీ : Jan 27, 2017 5:23 PM IST

‘జనసేన’ అనే పార్టీ ఒకటి ఉందా…? అంటున్న సీనియర్ హీరోయిన్…!

jayasudha
2014 ఎన్నికల్లో ‘జనసేన’ అనే పార్టీని స్థాపించి కేంద్రంలో బీజేపీ కి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఆ రెండు పార్టీలు అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం గత కొన్ని నెలలుగా జనసేన పార్టీ పోరాడుతుంది. తాజాగా వైజాగ్ లో నిరసన ప్రదర్శనలకు మద్దతు ఇచ్చి ఆ ఉద్యమం గురించి అందరికీ తెలిసేలా చేసింది కూడా ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్.

తాజాగా ప్రముఖ సీనియర్ హీరోయిన్ జయసుధ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ‘జనసేన’ పార్టీలో చేరుతారా…? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్ పార్టీ పేరు ‘జనసేన’ అని నాకు తెలియదని, పవన్ కళ్యాణ్ పార్టీ అంటేనే తెలుస్తుందని, పవన్ ఆలోచనలు బాగున్నాయి, అయితే తాను అందరినీ సపోర్ట్ చేస్తానని, కష్టపడిన వారే అధికారంలోకి వస్తారని ఆమె తేల్చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ లో చేరే విషయం గురించి మాట్లాడుతూ.. వద్దులెండి. 2009 ఎన్నికల ముందు మీరు చిరంజీవి పార్టీలో చేరుతారా అని నన్ను అడిగేవారు. కానీ కొన్ని నెలల తరువాత ఆయనే మా పార్టీలో చేరిపోయారని జయసుధ వ్యాఖ్యానించారు.

Comments