దేశమంతా అలా.. మోడీ భార్య మాత్రం ఇలా…!!

modi-wife
ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది ? ఈ నిర్ణయం వలన ప్రజలకు దేశానికీ ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి ? లేక ఇది దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందా..? రాజకీయ వర్గాల్లో, ఆర్థిక నిపుణులతో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు మాత్రం మోడీ నిర్ణయం వలన భారత ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తినిందని.. మోడీ ఓ తుగ్లక్ లా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ మాత్రం మోడీ నిర్ణయం వలన దేశం లో ఆర్ధిక సంస్కరణలు సాధ్యమవుతాయని అందులో భాగంగానే ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపు మళ్లిస్తున్నామని అంటున్నారు.

ప్రజలు ఒకింత మోడీ నిర్ణయం పై అసంతృప్తిగా త్వరలో పరిస్థితులు చక్కబడుతాయన్న ఆశ తో ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే మోడీ నుంచి విడిపోయిన అతని భార్య జశోదాబెన్ అభిప్రాయం ఇలా ఉంది. దేశంలో నల్ల ధనం వెలికి తీయడం డిమోనిటైజషన్ వల్ల సాధ్యమవుతుందని ఆమె అన్నారు. ఉపాధ్యాయురాలిగా రిటైర్ అయిన జశోదాబెన్ (64) రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన ఓ ప్రైవేట్ పాఠశాల స్వర్ణోత్సవం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పెద్ద నోట్ల రద్దు పై తన అభిప్రాయాన్ని తెలియజేసారు. పాతనోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదే అని ఆమె అన్నారు. ఈ మేరకు అవసరం లేనివారు గ్యాస్ సబ్సిడీ ని స్వచ్చందంగా వదులుకోవాలని మోడీ ఇచ్చిన పిలుపుని గుర్తుచేశారు. దానిద్వారా పెదలకు ఉచిత గ్యాస్ లభిస్తుందని అన్నారు.

Comments