ప్రచురణ తేదీ : Jan 21, 2017 1:07 PM IST

జల్లి కట్టు ఆదర్శంగా స్పెషల్ స్టేటస్ ఉద్యమం :

KVP
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ ఒక పెద్ద లేఖ రాసారు. ఏపీ ప్రత్యేక హోదా విషయం లో జల్లికట్టు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని ఆయన ఆ లేఖలో కోరారు , ఏపీ కి ప్రత్యేక హోదా సాధన కోసం చంద్రబాబు స్వయంగా నడుం బిగించి పోరాడాలి అనీ రాష్ట్ర ప్రజలు అందరికీ నాయకత్వం వహించాలి అని కోరారు ఆయన. ప్రత్యేక హోదా ఉద్యమానికి చంద్రబాబు నాయకత్వం వహిస్తే కనుక, అన్నివర్గాలు ఆయనకు తోడుగా నిలుస్తాయని అన్నారు. ‘చట్టవిరుద్ధమైన ‘జల్లికట్టు’నే తమిళులు సాధించుకున్నారు. చట్టబద్ధమైన హామీలను మనం ఎందుకు సాధించుకోలేం? ప్రత్యేక హోదా సాధించలేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతాం. భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసిన వారమవుతాం’ అని ఆ లేఖలో కేవీపీ పేర్కొన్నారు.

Comments