ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

మైనార్టీ మంత్రి ప‌ద‌వి ఆశ‌లు నెర‌వేరుతాయా?

jaleel-khan
విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ జ‌గ‌న్ చెర‌ను వీడి చంద్ర‌బాబు పంచ‌న చేరిన సంగ‌తి తెలిసిందే. నాటినుంచి అత‌డు వైకాపాని ఏకి పారేస్తూ వార్త‌ల్లోకొచ్చారు. అప్ప‌ట్లో బికాంలో ఫిజిక్స్‌, మ్యాథ్స్ అంటూ చేసిన వ్యాఖ్యానాలు పెను దుమారం రేపాయి. ఎమ్మెల్యే కామెడీ అంటూ సామాజిక మాధ్య‌మంలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. అయితే అదంతా స‌రే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారికి మైనార్టీ కోటాలో మంత్రి ప‌ద‌వి కావాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. త‌న ఆశ‌ను ప‌లుమార్లు బ‌హిరంగ వేదిక‌ల సాక్షిగా బ‌హిర్గ‌తం చేశారు. అస‌లు తేదేపాలో చేరిందే మంత్రి ప‌ద‌వి కోసం అన్న‌ట్టే ఉంది ఈయ‌న వ్య‌వ‌హారం. ఒక‌వేళ చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేస్తే ముందుగా త‌న‌కి మైనార్టీ కోటాలో ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశ‌ప‌డుతున్నారు. ఇన్నాళ్లు అస‌లు విస్త‌ర‌ణ మాటే ఎత్త‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికీ అదే పంథాని అనుస‌రిస్తున్నా ఆయ‌న‌లో ఆశ మాత్రం చావ‌డం లేద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా మ‌రోసారి తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ అధినేత‌ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అయితే జ‌లీల్ వ్యాఖ్యానాలు స‌భ‌లో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా చేశాయ‌ని, ఆయ‌న ఆశ ఎప్ప‌టికి నెర‌వేరుతుందో పైవాడే తేల్చాల‌ని చెప్పుకుంటున్నారు.

ఒక మైనార్టీ ఎమ్మెల్యేకి మంత్రి ప‌ద‌వి రావ‌డం అన్న మాట అటుంచితే అస‌లు బాబు పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ మాటే ఎత్త‌డం లేద‌ని ప‌లువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు బాధ‌ప‌డుతున్నారు.

Comments