ప్రచురణ తేదీ : Jan 12, 2018 4:35 PM IST

హిట్టా లేక ఫట్టా : ‘జై సింహా’ ట్రెండీ టాక్ !

బాలకృష్ణ నటించిన జై సింహా చిత్రం తాజగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలోకి బాలయ్య ఎప్పుడూ ఉత్సాహంగా దూకుతాడు. ఈ సారి సంక్రాంతికి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన జై సింహాని వదిలాడు. పూర్తి స్థాయిలో మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తెరకెక్కించారు. బాలయ్య సరసన ఈ చిత్రం నయనతార, హరిప్రియ మరియు నటాషా దోషి ముగ్గురు హీరోయిన్లు నటించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందు వచ్చిన సందర్భంగా మెప్పించేలా ఉందా లేదా ఇప్పుడు చూద్దాం..

బాలయ్యకు మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తనకున్న బలాన్నే ఈ చిత్రంలో ఆయుధంగా ఉపయోగించారు. ఈ చిత్ర ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులని ఆకట్టుకునే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అమ్ముకుట్టి సాంగ్, ఇంటర్వెల్ సన్నివేశం ఫస్ట్ హాఫ్ లో హైలైట్ అయిన అంశాలుగా చెపుకోవచ్చు. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా కథని నడిపిన విధానం బావుంది. బాలకృష్ణ ఎప్పటిలాగే తన అలుపెరుగని ఎనర్జీతో నటించాడు. డైలాగ్ డెలివరీలో మరో మారు తన ప్రత్యేకతని చాటుకున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ కు చేరువగా ఉన్నాయి. అన్నీ బానే ఉన్నా పాత తరం కథ, అదే తరహాలో సాగిన స్క్రీన్ ప్లే వలన ఈ చిత్రం కేవలం సింగిల్ స్క్రీన్ లకు మాత్రమే పరిమితం కానుంది. మల్టీప్లెక్సులలో ఈ చిత్రం అంతగా ప్రభావం చూపకపోవచ్చు.

 

జై సింహ – అభిమానులను మెప్పించే బాలయ్య

Reviewed By 123telugu.com |Rating : 3/5

స్పైసీ లెస్ మసాలా ఎంటర్టైనర్

Reviewed By mirchi9.com|Rating : 2.25/5

జై సింహా.. సెంటిమెంటు దట్టించిన ఫార్ములా మసాలా

Reviewed By tupaki.com |Rating : 2.25/5

సెంటిమెంట్ సింహం

Reviewed By gulte.com|Rating : 2.75/5 

Comments