ప్రచురణ తేదీ : Sat, Aug 12th, 2017

షాక్ .. లవకుశ దసరాకు వచ్చేది కష్టమే ?

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జై లవకుశ జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏకంగా మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే జై, లవ కుమార్ లకు సంబందించిన టీజర్ లను విడుదల చేసారు. ట్రైలర్ తో సంచలనం రేపిన ఎన్టీఆర్ ఈ దసరాకు అంటే సెప్టెంబర్ 21న వస్తాడని యూనిట్ తెలిపింది. ఇంకా షూటింగ్ చాలా వరకు మిగిలే ఉంది. ఈ నెలాఖరుకు పూర్తికావలసిన షూటింగ్ ఈ నెలలోనే కాకుండా వచ్చే నెలకు వెళ్లేలా ఉంది. సెప్టెంబర్ లోను షూటింగ్ జరిగే అవకాశం ఉంది .. దాంతో సినిమా విడుదలకు ముందు పనులన్నీ అంత త్వరగా కావు కాబట్టి .. అనుకున్న సమయంలో విడుదల అయ్యే అవకాశాలు తక్కువ. అందుకే ఈ సినిమా అనుకున్న సమయంలో విడుదల కాదని ప్రచారం జరుగుతుంది. ఇక దసరా బరిలో ఇప్పటికే మహేష్, బాలయ్య లు రెడీ గా ఉన్నారు. మరి ఈ లవకుశలను అనుకున్న సమయానికి విడుదల చేస్తారో లేదో చూడాలి !!

Comments