ప్రచురణ తేదీ : Thu, Sep 14th, 2017

ఒకే రోజు షాక్ ఇస్తున్న జై లవకుశ.. స్పైడర్!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వం లో తెరకెక్కిన జై లవకుశ లో కొత్తగా ఓ ఐటెమ్ సాంగ్ చేర్చిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ లో స్టార్ కథానాయక తమన్నా డాన్స్ చేసింది. ఇప్పుడు ఈ సాంగ్ ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరో వైపు అదే రోజు మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్నా స్పైడర్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపధ్యంలో ఇక అసలు పోరుకి ముందే రెండు సినిమాల మధ్య సెమీ ఫైనల్ పోరు జరుగుతున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. ఈ రెండు సినిమాల సాంగ్ టీజర్, ట్రైలర్ సెప్టెంబర్ 15 అంటే శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. మరి ఈ రెండింటి లో ఏది ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Comments