ప్రచురణ తేదీ : Thu, Sep 14th, 2017

జై లవ కుశ సెన్సార్ టాక్.. ఎన్టీఆర్ ఫాన్స్ ఫిక్స్ అయిపోవచ్చు..!


జై లవకుశ.. ఈ అందాన్ని ఎన్టీఆర్ అభిమానులు జపం చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 21 న భారీ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తన కెరీర్ లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. పవర్ చిత్రం ద్వారా మాస్ కథలని హ్యాండిల్ చేయగలనని దర్శకుడు బాబీ నిరూపించుకున్నాడు. వీరి కాంబినేషన్ లో ఈ చిత్రం రాబోతుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే టీజర్లు, ట్రైలర్ లు జనాలను బాగా ఆకట్టుకున్నాయి. సాధారణంగానే అద్భుత నటన కనబరిచే ఎన్టీఆర్..ఈ చిత్రంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించినట్లు ఇన్ సైడ్ నుంచి టాక్.

కాగా ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. కాగా జై లవకుశ చిత్రానికి సెన్సార్ సభ్యుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. 2 గంటల 35 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనే ప్రధాన హైలైట్ గా సాగినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రల్లో ఒకదానిని బాగా ఎలివేట్ చేశాడట. మిగిలిన రెండు పాత్రలకు అంతగా ప్రాధాన్యం లేకపోయినా సినిమా మొత్తాన్ని ఎన్టీఆర్ నటనతో నడిపించినట్లు తెలుస్తోంది. ఇంటర్వల్ నుంచి దర్శకుడు బాబీ కథని మరో లెవెల్ కి తీసుకుని వెళ్లాడట. ఈ చిత్రంపై ఇప్పటికే విపరీతమైన పాజిటివ్ బజ్ ఏర్పడి ఉంది. సెప్టెంబర్ 21 న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

Comments