ప్రచురణ తేదీ : Sun, Nov 12th, 2017

ధఢక్.. ధఢక్ అంటున్న శ్రీదేవి కూతురు ?

మొత్తానికి అందాల రాశి శ్రీదేవి కూతురు .. జాహ్నవి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసారు. మరాఠీలో సూపర్ హిట్ అయిన సైరత్ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. మరాఠీలో సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో హీరోయిన్ పాత్రే కీలకం. వచ్చే నెలలో సెట్స్ పైకి రానున్న ఈ సినిమా హర్యానాలో షూటింగ్ జరుపుతారట. మరి ఈ సినిమాతో జాహ్నవి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Comments