ప్రచురణ తేదీ : Jan 31, 2017 9:45 PM IST

వైరల్ గా మారిన జగన్ ముద్దు..మార్ఫింగా..?

jagannn
వైసిపి అధినేత జగన్ కు సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పరామర్శలు, ఓదార్పులు అంటూ జగన్ ఎప్పుడు ప్రజల మధ్యలో తిరుగుతుంటారు.ప్రజల్లో తిరిగేటప్పుడు వృద్దులను, ఆడవారిని జగన్ ఆప్యాయంగా పలకరిస్తూంటారు. వారి నుంచి కూడా జగన్ కు అదే ఆప్యాయత ఎదురవుతుంది. జగన్ మహిళ వృద్దులను ఆప్యాయంగా వారి నుదురుపై ముద్దాడడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ జగన్ కు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జగన్ ని ఓ వృద్దురాలు ముద్దు పెట్టుకుంటున్న ఫోటో వైరల్ గా మారింది.వృద్దురాలు జగన్ ని ముద్దుపెట్టుకుంటే అందులో ఆశ్చర్యపోవలసింది ఏముంది అనుకుంటున్నారా ? ఆమె జగన్ పెదాలపై ముద్దాడడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ ఈ సంఘటన ఎక్కడజరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో అని కొట్టిపారేసేవారూ లేకపోలేదు.

Comments