ప్రచురణ తేదీ : Dec 7, 2017 10:19 PM IST

స్వీటీ స్పాకి ఎందుకెళ్లింది? వెన్నునొప్పి నిజ‌మా?


స్వీటీ అనుష్క‌పై గ‌త కొంత‌కాలంగా అనూహ్య‌మైన రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. స్వీటీ బ‌రువు పెరిగి పీక‌ల‌మీదికి తెచ్చుకుంది. అద‌న‌పు బ‌రువు వ‌ల్ల త‌న‌వైపు వ‌చ్చే అవ‌కాశాల్ని కోల్పోవాల్సి వ‌స్తోంద‌న్న టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు ప్ర‌భాస్‌ని అనుష్క పెళ్లాడేసింద‌ని పుకార్లు షికారు చేశాయి. పెళ్లి వార్త‌లపై స్వీటీ క‌స్సుబుస్సు మ‌న్నా.. బ‌రువు త‌గ్గించుకునే ట్రీట్మెంట్ల విష‌యంలో నోరు విప్ప‌లేదు.

తాజాగా స్వీటీ ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణం త‌న ట్రీట్మెంట్ లో ఆల‌స్య‌మేన‌న్న టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం కోయంబ‌త్తూర్‌, కేర‌ళ‌లో రెండు వారాలుగా వెయిట్ రిడ‌క్ష‌న్‌ చికిత్స కొన‌సాగుతోంద‌ని చెబుతున్నారు. పెరిగిన బ‌రువు వ‌ల్ల వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతోంది. దానికి కూడా చికిత్స చేస్తున్నార‌ని తెలుస్తోందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ బాధ‌ల‌న్నిటినుంచి ఉప‌శ‌మ‌నం పొందాక తిరిగి లైమ్‌లైట్‌లోకి వ‌స్తుందిట‌. ఇక జ‌న‌వ‌రిలో రిలీజ్‌కి వ‌స్తున్న భాగ‌మ‌తి ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తోనూ బిజీ అయిపోతుందిట‌. జ‌న‌వ‌రి 26న భాగ‌మ‌తి రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

Comments