ప్రచురణ తేదీ : Dec 6, 2017 12:52 PM IST

రంగస్థలంలో అలాంటి సీనా..!

రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చరణ్ తొలిసారి విలేజ్ కుర్రాడిగా వైవిధ్య భరితమైన పాత్రలో కనిపించనుండడంతో ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా రూపొందించిన విలేజ్ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.

ఈ చిత్ర షూటింగ్ కి సంబందించిన ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. రంగస్థలంలో ఇటీవలే అత్యంత ఉత్కంఠ రేకెత్తించే బైక్ ఛేగింగ్ సన్నివేశాలని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రంగస్థలం లాంటి సినిమాలో బైక్ ఛేజింగ్ సన్నివేశాలు ఉండడమే ఒకింత ఆశ్చర్యం. అలాంటిది వాటిని ఉత్కంఠ భరితంగా చిత్రీకరించారట. ఆ సన్నివేశాలు అభిమానులని థ్రిల్ చేయస్తాయని చెబుతున్నారు. ఈ న్యూస్ సినిమాపై మరింత అంచనాలు పెంచేదిగా ఉంది. పుర్తిగా గ్రామీణ నేపథ్యంలో అదీ 1985 బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం సాగుతుంది. అలాంటిది ఈ సినిమాలో బైక్ సీన్స్ ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ ఏదైనా సర్ ప్రైజ్ చేస్తాడా అని మెగా ఫాన్స్ చర్చించుకుంటున్నారు. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది.

Comments