ప్రచురణ తేదీ : Feb 23, 2017 4:56 PM IST

విదేశాలు వలస వెళ్ళిపోతున్న భారత కుబేరులు


భారతదేశం నుంచి వట్టి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లో లేక వ్రుత్తి నైపుణ్యం కలవారో విదేశాలకి వలస వెళ్ళిపోతున్నారు అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే భారత దేశం నుంచి ఎందఱో కోటీశ్వరులు కూడా నెమ్మదిగా సైడ్ అయిపోయి వేరేదేసం వెళ్ళిపోతున్నారు. గత ఏడాది భారత్ నుంచి 6వేల మంది అపరకుబేరులు పరసీమలకు తరలిపోయారని న్యూవరల్డ్ వెల్త్ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. 2015లో ఇలా వలస వెళ్లిన సంపన్నుల సంఖ్య 4 వేల వరకు ఉన్నట్టు సంస్థ తెలిపింది. గత ఏడాది దాదాపు 82 వేల మంది మిలియనీర్లు విదేశాలకు వలస వెళ్లిపోయారని ఈ సంస్థ నివేదిక చెబుతోంది. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 64 వేలుగా ఉందని ఆ నివేదిక అంటోంది. 2016లో ఆస్ట్రేలియాకు 11 వేల మిలియనీర్లు వలస వెళ్లారని అంచనా. అమెరికాకు 10 వేల మంది బ్రిటన్ కు 3 వేల మంది వలస వెళ్లారు. కెనడా యుఎఇ – న్యూజీలాండ్ – ఇజ్రాయెల్ కూ వలసలు పెరిగాయని సదరు నివేదిక చెబుతోంది.

Comments