ప్రచురణ తేదీ : Nov 12, 2017 1:26 AM IST

క్రికెట్ లో బంతి తగిలి గ్రౌండ్ లోనే కుప్పకూలిన ఆటగాడు

క్రికెట్ ఆటలో ఒక్కోసారి అనుకోకుండా బంతులు తగిలి తీవ్రంగా గాయపడుతుంటారు. అంతే కాకుండా ఒక్కసారి వారి ప్రాణాలనే కోల్పోతుంటారు. ఇలాంటి ఘతనలు క్రికెట్ చరిత్రలో ఎన్ని జరిగాయి. రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన క్రికెట్ దిగ్గజాలను కూడా షాక్ కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. రంజీ ట్రోపీలో భాగంగా విదర్భ-బెంగాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అట ఉత్కంఠంగా సాగుతుండగా ఒక బౌలర్ వేసిన బౌన్సర్ బ్యాట్స్ మెన్ గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. 27 ఏళ్ల విదర్భ ఆల్ రౌండర్ ఆదిత్య సర్వాతే బెంగాల్ బౌలర్ ఇషాన్ పోరెల్ సంధించిన బౌన్సర్ ని ఎదుర్కొనాగా అది అనుకోకుండా హెల్మెట్ కుడివైపున తగిలింది. దీంతో బ్యాట్స్ మెన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ప్లేయర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే అతగాడికి ప్రధమ చిక్కిత్స అందించి సమీపాన ఉన్న హాస్పిటల్ కి తరలించారు. సమయానికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు.

Comments