ప్రచురణ తేదీ : Fri, Sep 29th, 2017

50 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్ వలన ఎన్నారై కి 10 ఏళ్ల జైలు శిక్ష..!

మాజీ గర్ల్ ఫ్రెండ్ ని వేధించినందుకు లండన్ లోని ప్రవాస భారతీయుడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. పశ్చిమ లండన్ లో ఉంటుంది ప్రదీప్ థామస్ (37) అనే వ్యక్తికి 50 ఏళ్ల మహిళతో కొంత కాలం ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ తరువాత విభేదాలు తలెత్తడంతో వీరిద్దరూ విడిపోయారు. కొంత కాలంగా ప్రదీప్ విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. మళ్లీ ఆమె వెంట పడడం ప్రారంభించాడు.

ఇంత పురుషులతో మాట్లాడితే చంపేస్తా, యాసిడ్ పోస్తా అంటూ బెదిరించసాగాడు. రోజు ఆమె ఇంటికి వెళ్లి లోనికి రానివ్వకుంటే ఇంటిని తగలబెడుతా అని బెదిరిస్తూ ఉండేవాడు. దీనితో బెదిరిపోయిన ఆ మహిళ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. దీనితో పోలీస్ లు దర్యాప్తు చేపట్టగా అతడు 12, 13 తేదీల్లో 73 మిస్ కాల్స్, 35 వైస్ మెస్సేజ్ లు పంపినట్లు తేలింది. మద్యం మత్తులో అలా చేసానని తప్పించుకోవడానికి ప్రయత్నించినా కోర్టు కఠినంగానే శిక్షించింది. అతడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

Comments